ప్రజలందరికీ ఉచితంగా కరోనా టెస్టులు చేసి... వైద్యం అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ముందు సీపీఎం కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్ణపు సోమయ్య విమర్శించారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీపీఎం - కరోనా వైరస్ వార్తలు
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా ముందు సీపీఎం కార్యకర్తలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రజలందరికీ ఉచితంగా కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీపీఎం
దేశంలో, రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నమోదైన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే ఈ విధంగా విస్తరించి ఉండేది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించి, ఉచితంగా వైద్యం అందించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ప్రజలందరికీ టెస్టులు చేసి వైద్యం అందిస్తుండగా... మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు.
ఇవీ చూడండి: కరోనా నుంచి దేవుడే కాపాడాలి: ఆరోగ్య మంత్రి