మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ నియంత్రణ వ్యాక్సిన్‌ను పారిశుద్ధ్య, ఆరోగ్య సిబ్బందికి మంత్రి దగ్గరుండి వేయించారు.
అందరికీ వ్యాక్సిన్ అందజేస్తాం: మంత్రి ఎర్రబెల్లి - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఉపశమనం లభించింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు.
దగ్గరుండి వ్యాక్సిన్ వేయించిన మంత్రి ఎర్రబెల్లి
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కృషి వల్లే ఈ రోజు దేశ, రాష్ట్ర ప్రజలందరికీ కరోనా నియంత్రణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఎర్రబెల్లి తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి :వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను నమ్మొద్దు: సీఎస్