సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ పట్టణంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఎల్పీ విలీనాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు
మహబూబాబాద్ పట్టణంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విలీనాన్ని ఆపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు