తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​

మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వాసుత్రిని జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు.

Collector  VP Gautam inspected the Mahabubabad District Government hospital
ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​

By

Published : Sep 19, 2020, 7:07 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం, ఆహారం ఇతర సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న కొవిడ్​ పరిక్షా కేంద్రాన్ని సందర్శించారు. పీపీఈ కిట్టు ధరించి ఐసోలేషన్​ వార్డులోకి వెళ్లి... చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలోని ప్రజలందరూ జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్న వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

ABOUT THE AUTHOR

...view details