మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హోమ్ క్వారంటైన్ గృహాలను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సందర్శించి వారి పరిస్థితిని పరిశీలించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.
హోమ్ క్వారంటైన్ గృహాలను పరిశీలించిన కలెక్టర్ - home quarantine
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హోమ్ క్వారంటైన్ గృహాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడి పరిస్థితుల గురించి క్వారంటైన్లో ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు.
హోమ్ క్వారంటైన్ గృహాలను పరిశీలించిన కలెక్టర్
కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రతి రోజు వస్తున్నారా, ఉష్ణోగ్రత వివరాలను నమోదు చేస్తున్నారా, అలాగే ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లకు వివరిస్తున్నారా అని క్వారంటైన్లో ఉన్నవారిని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగుందని, వైద్య సిబ్బంది తరచూ వచ్చి పోతున్నారని వారు తెలిపారు.
ఇవీ చూడండి: మొత్తం 15 బృందాలు.. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు