తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభానికి సీఎం గ్రీన్​ సిగ్నల్​

మహబూబాబాద్​ జిల్లా మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రానికి అనుసంధానంగా ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారని ఎమ్మెల్యే బానోత్​ శంకర్​ నాయక్​ తెలిపారు.

CM Green signal for opening of Garden Polytechnic College
ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభానికి సీఎం గ్రీన్​ సిగ్నల్​

By

Published : Jul 30, 2020, 9:48 PM IST

సీఎం కేసీఆర్​ను బానోత్​ శంకర్​ నాయక్​ కలిశారు. మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రానికి అనుసంధానంగా ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి జె.రఘోత్తం రెడ్డి 160 ఎకరాల భూమి, కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వివరించారు. కేవీకేకు అనుసంధానంగా ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు.

నాలుగురోజుల క్రితం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కేవీకేను సందర్శించి, నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభిద్దామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ABOUT THE AUTHOR

...view details