ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తిలో చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన తన తల్లితో పాటు నజీర్ నీటి కుంట వద్దకు వెళ్లాడు. ఆడుకుంటూ వెళ్లి కుంటలో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన తల్లి కేకలు వేస్తూ బాబును కాపాడే క్రమంలో ఆమె కూడా అందులో పడిపోయింది. సమీపంలోని వాళ్లు అక్కడికి చేరుకుని లాలిని రక్షించినా.. బాలుడు మాత్రం చనిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న లాలిని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు.
ఆడుకుంటూ వెళ్లి ఆరేళ్ల బాలుడు మృతి - నీటి కుంట
ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు వెళ్లాడు ఆరేళ్ల బాలుడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా మదనతుర్తిలో జరిగింది.
ఆడుకుంటూ వెళ్లి ఆరేళ్ల బాలుడు మృతి