మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి పాల్గొన్నారు. మేళ తాళాలతో ముత్యాలమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అమ్మవారి దర్శనానికి నగరంలోని ప్రజలు బారులు తీరారు.
శ్రావణ మాసంలో ఘనంగా బోనాల పండుగ - శ్రావణ మాసం
హైదరాబాద్లో ఆషాడ మాసంలో బోనాల పండుగను జరుపుకుంటే, మహబూబాబాద్ ప్రాంతంలో మాత్రం శ్రావణ మాసంలో బోనాల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రావణ మాసంలో ఘనంగా బోనాల పండుగ