తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​ జిల్లాలో బ్లాక్ ఫంగస్ అనుమానితుడు!

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ అనుమానితుడిని డాక్టర్లు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న ఓ యువకుడిలో లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. బాధితుడిని హైదరాబాద్​లోని కోఠి ఆస్పత్రికి తరలించారు.

Black fungus suspect, corona case
మహబూబాబాద్​లో బ్లాక్ ఫంగస్, కరోనా కేసు

By

Published : May 23, 2021, 7:04 AM IST

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ యువకుడిని బ్లాక్ ఫంగస్ అనుమానంతో హైదరాబాద్ కోఠిలోని ఈఎన్​టీ హాస్పిటల్​కు తరలించారు. బయ్యారం మండలం బాల్యా తండాకు చెందిన ఈ యువకుడు కరోనా గురై జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

కొవిడ్​ నుంచి కోలుకున్న మూడు రోజులకే కుడి కన్ను కొద్దిగా వాపు రాగా... ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఇంఛార్జ్ డాక్టర్ సతీష్​ను సంప్రదించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కోఠి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ఉద్ధృతి తగ్గుతున్నా.. లాక్​డౌన్ బాటలోనే రాష్ట్రాలు!

ABOUT THE AUTHOR

...view details