మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తెరాసలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని భాజపా జాతీయ కిసాన్ మోర్చ కార్యదర్శి సుగుణాకర్‌రావు అన్నారు. పార్టీలో ముసలం ప్రారంభమైందని హరీశ్‌రావు అలిగి కూర్చున్నారని, కార్యకర్తలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని చెప్పారు. ఈటల మాటలే అందుకు నిదర్శనమన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదని ఆరోపించారు.
తెరాసలో ముసలం మొదలైంది: సుగుణాకర్‌రావు - భాజపా జాతీయ కిసాన్ మోర్చ
తెరాసలో ముసలం మొదలైందని భాజపా నేత సుగుణాకర్‌రావు అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన అన్నారు.
ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం తగ్గుతోంది :సుగుణాకర్‌రావు