మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామ శివారులో పాకాల వాగుపైనున్న చెక్‌డ్యామ్ నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు సాగుతున్నాయి. బయ్యారం చెరువు అలుగు పోస్తున్నందున వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి డ్యామ్ పైనుంచి ఆటో వాగులోకి కొట్టుకుపోయింది. ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా.. వాహనాన్ని తాడు సహాయంతో బయటకు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చెక్‌డ్యామ్‌పై రాకపోకలు నిలిపివేశారు.
పాకాల వాగు ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆటో - వైరల్
వాగు ఉద్ధృత ప్రవాహానికి చెక్‌డ్యామ్ పైనుంచి ఆటో... వాగులో కొట్టుకుపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలో చోటుచేసుకుంది.
పాకాల వాగు ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆటో