మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామంలోని వ్యవసాయ భూముల్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలపై రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామ శివారులోని వివిధ ప్రాంతాల్లో పలువురు అక్రమంగా ఇసుక నిల్వ చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన దాదాపు మూడు వందల ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక రాశులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అక్రమ ఇసుక నిల్వలపై అధికారుల దాడులు - మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా వ్యవసాయ భూముల్లో నిల్వ చేసిన ఇసుక నిల్వలపై రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
అక్రమ ఇసుక నిల్వలపై అధికారుల దాడులు