తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టిన రోజు బహుమతి... ఇంకుడు గుంత

పుట్టిన రోజున స్నేహితులు, పార్టీలంటూ అందరిలాగా అతను వృథా ఖర్చు చేయలేదు. తమ ప్రాంతంలో ఏర్పడిన నీటి ఎద్దడిని గుర్తించి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా భవిష్యత్​ తరాలకు నీరందించేందుకు ఇంకుడు గుంత ఏర్పాటు చేశాడు.  పుట్టిన రోజంటే బహుమతి పొందడమే కాదు... బహుమతి ఇవ్వడం కూడా అని అంటున్నాడు మహబూబాబాద్​ జిల్లాకు చెందిన శ్రీనివాస్.

an-youngster-from-mahabubabad-district-on-his-birthday-duga-recharge-pit-to-save-water

By

Published : Jul 20, 2019, 2:06 PM IST

Updated : Jul 20, 2019, 2:52 PM IST

పుట్టిన రోజు బహుమతి... ఇంకుడు గుంత

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని హనుమంతునిగడ్డ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్​ అనే యువకుడు నీటి ఎద్దడిని నివారించేందుకు తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాడు. తన పుట్టిన రోజు సందర్భంకా కేకులు కట్​ చేసి దుబారా ఖర్చు చేయకుండా ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వాసవి సేవా ట్రస్ట్ చేస్తున్న ప్రచారానికి ఆకర్షితుడై​ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రారంభించాడు.

బంధువులు, స్నేహితుల అభినందన

చుట్టుపక్కలవారు, బంధు మిత్రులంతా శ్రీనివాస్​ను అభినందించారు ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

శ్రీనివాస్ తరహాలోనే మిగతా వారు కూడా జల సంరక్షణకు పూనుకుంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్యను అధిగమించడం సులువవుతుంది.

Last Updated : Jul 20, 2019, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details