తేనెటీగల దాడిలో ఆరుగురు చిన్నారులు, ఓ వృద్ధురాలు గాయపడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాల్తియా తండాలో చోటుచేసుకుంది. తండాలో పలు కుటుంబాలకు చెందిన రైతులు మిరప తోటల వద్దకు వెళ్లగా.. వారి పిల్లలు ఇంటి వద్దే ఆడుకుంటున్నారు. ఈ సమయంలో తేనె తుట్టెపై రాయి విసరడం వల్ల తేనెటీగలు ఒకేసారి దాడి చేశాయి.
తేనెటీగల దాడి.. చిన్నారులు, వృద్ధురాలుకి గాయాలు - తేనెటీగల దాడి వార్తలు
తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. వారి పిల్లలు ఇంటి వద్దే హాయిగా ఆడుకుంటున్నారు. ఆ సమయంలో వారికి తేనెతుట్టె కనిపించింది. అసలే చిన్నపిల్లలు.. తుంటరి చేష్టలు ఎక్కువ. మరి చూస్తూ ఉండలేకపోయారేమో తుట్టెపైకి రాయి విసిరారు. ఇంక అంతే తేనెటీగలన్నీ ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా ఓ వృద్ధురాలికి గాయాలయ్యాయి.
తేనెటీగల దాడి, మహబూబాబాద్ జిల్లా
తక్షణమే వారిని గూడూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం.. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి:బంజారాహిల్స్ పీఎస్‌లో సీఐ, ఎస్ఐ సహా 11 మంది పోలీసులకు కరోనా