మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గుడిపూడి నవీన్ రావుతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలో ఆస్తిని, ఇంకా ఏదైనా వస్తువులను దోచుకోవచ్చని... కాని చదువును దోచుకోలేరని, ఉన్నత శిఖరాలను అధిగమించడానికి చదువు ఒక్కటే మార్గమమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పారు.
మహబూబాబాద్‌లో 52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు - library day
మహబూబాబాద్ జిల్లాలోని గ్రంథాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యను మాత్రం ఎవరూ దోచుకోలేరని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
మహబూబాబాద్‌లో 52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఏ పని చేసినా ఇష్టపడి చేయాలని... కష్టపడి చదవాలని అప్పుడే చదువుకున్న చదువుకు సార్ధకత లభిస్తుందన్నారు. లైబ్రరీలో అనేకానేక పుస్తకాలు ఉంటాయని, పుస్తకాలు చదివే అలవాటు ఎవరికైతే ఉంటుందో వారి జీవితం బాగుంటుందని, ప్రతి రోజు కనీసం గంటపాటు గ్రంథాలయంలో కూర్చుని మంచి... మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఇదీ చూడండి: నిరసనలో ఆర్టీసీ కార్మికునికి అస్వస్థత...