మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసిందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకు షీటీమ్స్ ఆధ్వర్యంలో 2కే పరుగు నిర్వహించారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ పరుగు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
'మహిళల్లో చైతన్యం కోసమే 2కే పరుగు'
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో షీటీమ్ ఆధ్వర్యంలో 2కే పరుగు నిర్వహించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం సమయాభావం వల్ల ఇప్పుడు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
'మహిళల్లో చైతన్యం కోసమే 2కే పరుగు'