కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండల కేంద్రంలోని బజార్ గూడా కాలనీలో నీటి సమస్య తీర్చాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా చేపట్టారు. నాలుగు నెలలుగా నీటి సమస్య ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్ని సార్లు తమ సమస్య విన్నవించుకున్నా... పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.
నీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో మహిళల ధర్నా - water problem
నాలుగు నెలలుగా నీటి సమస్యతో బాధపడుతున్నా పట్టించుకున్న నాథుడే లేదని ఆరోపిస్తూ... కుమురం భీం జిల్లా సిర్పూర్ యు పట్టణంలో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా... స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
women protested for water problems in sirpur u mandal
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా... వాగ్వాదానికి దిగారు. సర్పంచ్ వీణాబాయి వచ్చి మాట్లాడినా లాభం లేకుండా పోయింది. నాలుగు నెలలుగా సమస్య ఉందని తెలిసిన ఎందుకు స్పందించలేదని మహిళలు సర్పంచ్ని నిలదీశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వగా... మహిళలు శాంతించారు.