కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం సోమిని గ్రామానికి చెందిన కొండ్ర శంకరమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని వాగు ఉప్పొంగడం వల్ల అంబులెన్స్ రాలేని పరిస్థితి. బంధువులు 5కిలోమీటర్ల వరకు ఎడ్ల బండిలో రావాల్సి ఉండటం వల్ల శంకరమ్మ మార్గమధ్యలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చివరకు అదే ఎడ్ల బండిలో వాగు దాటి ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఎడ్ల బండిలో మహిళ ప్రసవం
ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె బంధువులు వెంటనే 108కి సమాచారమందించారు. వర్షాలతో వాగు రావడం వల్ల అంబులెన్స్ రాలేని పరిస్థితి. చేసేదేమిలేక ఎడ్ల బండిలో ఆమెను తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ప్రసవించిన ఘటన కుమురం భీం జిల్లా మండలం సోమినిలో చోటుచేసుకుంది.
ఎడ్ల బండిలో మహిళను తీసుకెళ్తూ