కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం బొంబాయిగూడాలో రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి, పాఠశాలకు వెళ్లడానికి మార్గం కోసం గ్రామస్థులంతా కలిసి స్థలాన్ని కేటాయించారు. ఇందుకు గ్రామంలోని ఒక కుటుంబం ఒప్పుకోకపోవడం వల్ల రహదారి పనులు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామస్థులు సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆశ్రయించగా.. పాలనాధికారి మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.