తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏం కొనేటట్టు లేదు... ఏం తినేటట్టు లేదు' - vegetables price hike in komaram bheem asifabad district

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అకాల వర్షాలతో సాగు తగ్గిపోవడం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరిగాయి. ఫలితంగా ధరలు పెరిగి సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి.

vegetables price hike in kumrambheem asifabad district
ఏం కొనేటట్టు లేదు... ఏం తినేటట్టు లేదు

By

Published : Dec 19, 2019, 11:54 AM IST

ఏం కొనేటట్టు లేదు... ఏం తినేటట్టు లేదు

కుమురంభీం ఆసిఫాబాద్​ మార్కెట్​లో కూరగాయల ధర చూస్తే.. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే సామెత గుర్తొస్తోంది.సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో కురిసిన వర్షం కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

మార్కెట్​కు వెళ్లాలంటే సామాన్యులు భయపడుతున్నారు. డిమాండ్​కు తగ్గ సప్లై లేకపోవడం వల్ల ఉల్లి, కొత్తిమీర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో కొత్తిమీర రెండు వందల రూపాయలు పలుకుతుండగా, ఉల్లి కిలో 70 రూపాయల నుంచి 120 రూపాయలకు చేరుకుంది.

ప్రభుత్వం స్పందించి కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే... సామాన్యుడి నోటికి ముద్ద కరువయ్యే పరిస్థితి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details