కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కాళ్లు చేతులు కట్టిపడేశారు. పట్టణంలోని చెక్‌పోస్ట్ వద్ద కాళ్లు, చేతులు కట్టేసి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడు కాగజ్‌నగర్ పట్టణం సి.బాపు కాలనీకి చెందినవాడిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కాళ్లు చేతులు కట్టేసిన దారుణ ఘటన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
Last Updated : Oct 30, 2019, 8:23 AM IST