No Electricity at komaram bheem project : కుమురం భీం జిల్లాలో 10టీఎంసీల సామర్థ్యం గల కుమురం భీం ప్రాజెక్టు, 2 టీఎంసీల వట్టివాగు ప్రాజెక్టు ఉన్నాయి. ఈ రెండు జలాశయాలు ప్రస్తుత వర్షాలకు నిండు కుండలా మారాయి. కుమురం భీం ప్రాజెక్టు వరదల తాకిడికి కట్ట చివరి భాగం దెబ్బతింది. ప్రస్తుతం అధికారులు పాలిథిన్ కవర్ కప్పి ఉంచారు. గేట్లు ఎత్తిన సమయంలో ఎంత నీరు వదిలారు.. ఎంత ఎత్తుకు ఎత్తారో చెప్పడానికి వినియోగించే డైల్ గేజ్ లేదని అధికారులు చెబుతున్నారు.
ఆ ప్రాజెక్టుల గేట్ల మతలబు.. జనరేటర్లకే ఎరుక - No Electricity at komaram bheem project
No Electricity at komaram bheem project : కుమురం భీం జిల్లాలో అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని ఆ రెండు ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా ఆ ప్రాజెక్టుల గేట్లను ఎత్తాలంటే జనరేటర్లు దిక్కయ్యాయి. భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఊహించిన వరద ఉద్ధృతి వచ్చిప్పుడు.. అవి కూడా మోరాయిస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులు
రెండు ప్రాజెక్టులకు ఏడాది క్రితం విద్యుత్ బిల్లులు చెల్లించలేదని అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో జనరేటర్తోనే గేట్లను ఎత్తుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రెండు ప్రాజెక్టులు తరుచూ నిండుతున్నాయి. ఇలాంటి సందర్భంలో జనరేటర్లు మొరాయిస్తే అనకట్టలకు ప్రమాదమని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.ఇప్పటికైనా కట్టను పటిష్ఠం చేసి రెండు జలాశయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.