కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి నుంచి కైరిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో సిమెంట్ పైపులతో తాత్కాలిక వంతెన నిర్మించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగుపై ఉన్న ఈ వంతెన కుంగిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, కూలీలు అత్యవసర పరిస్థితుల్లో ఈ వంతెనపై ప్రయాణించాల్సివస్తోంది. ఈ మార్గంలో వేరే రహదారి లేకపోవడం వల్ల గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షానికి కుంగిన వంతెన.. గ్రామస్థుల నరకయాతన - అధికారులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెబ్బెన మండలం కైరిగూడలోని వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కుంగిపోయింది.
వర్షానికి కుంగిన వంతెన.. గ్రామస్థుల నరకయాతన