తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చని సంసారంలో చిచ్చు - ప్రాణం తీసిన ఫోన్‌ కాల్‌

ఆకతాయి ఫోన్‌ చేసి విసిగించడం.. దానిని భర్త అనుమానించడం.. ఇదంతా అవమానంగా భావించిన ఓవివాహిత ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన కుమురం భీం జిల్లా జైనూరు మండలం కొండిబగూడ గ్రామంలో జరిగింది.

By

Published : Nov 15, 2019, 6:58 AM IST

Updated : Nov 15, 2019, 7:27 AM IST

ఫోన్‌ కాల్‌ ఓ వివాహిత ప్రాణం తీసింది

పచ్చని సంసారంలో ఓ ఫోన్‌ కాల్‌ చిచ్చుపెట్టింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండిబగూడకు చెందిన రమాకాంత్‌కు నాలుగేళ్ల కిందట జైనూరు మండల కేంద్రంలోని శివాజీనగర్‌ వాసి సోన్‌కాంబ్లె సీతాల్​తో వివాహం జరిగింది. కూలీనాలీ చేస్తూ అన్యోన్యంగా కొనసాగుతున్న దంపతుల జీవితంలోకి అదే గ్రామానికి చెందిన బొడికే అనికేతన్‌ ఫోన్‌కాల్‌ ప్రవేశించడం వల్ల చిచ్చురేగింది.

తరచుగా సదరు వివాహితకు అనికేతన్‌ ఫోన్‌ చేసి వేధిస్తోండడం వల్ల విసుగుచెందిన ఆమె అతణ్ని ఫోన్‌లోనే నిలదీసింది. కోపోద్రిక్తుడైన యువకుడు వివాహితపై ఆమె భర్తకు లేనిపోని మాటలు చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలో ఈ నెల ఏడున రమాకాంత్‌ భార్యను నిలదీశాడు. ఇద్దరూ గొడవపడ్డారు.

పురుగుల మందు తాగి

తనపై అకారణంగా నిందలు వేయడమే కాక ఫోన్‌ ద్వారా యువకుడు వేధింపులు ఆపకపోవడం వల్ల సీతాల్‌ పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సీతాల్‌ కన్నుమూసినట్లు ఎస్‌ఐ తిరుపతి పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

Last Updated : Nov 15, 2019, 7:27 AM IST

For All Latest Updates

TAGGED:

phone call

ABOUT THE AUTHOR

...view details