తెలంగాణ

telangana

ETV Bharat / state

దోస్త్ కావాలి... ప్రవేశాలు కల్పించండి - undefined

దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్య అందించిన ఎస్కేఈ కళాశాల దోస్త్​లో పేరు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధ్యాపకులను నియమించి... ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ske

By

Published : May 27, 2019, 11:32 PM IST

దోస్త్ కావాలి... ప్రవేశాలు కల్పించండి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైక ఎయిడెడ్ డిగ్రీ కళాశాల... సిర్పూర్ కాగజ్ నగర్ ఎంప్లాయిస్ డిగ్రీ కళాశాల. దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన ఈ కళాశాల చరిత్రపుటలకే పరిమితం కానుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ సారి దోస్త్ నోటిఫికేషన్​లో ఎస్కేఈ కళాశాల పేరు లేకపోవడం వల్ల ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ప్రవేశాలు లేనట్లుగానే తెలుస్తోంది.

ఒక్కరోజు వేతనంతో ఏర్పాటు

పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్ నగర్​లో సర్సిల్క్ మిల్లు, సిర్పూర్ కాగితం మిల్లు కార్మికుల ఒకరోజు వేతనంతో సిర్పూర్ కాగజ్ నగర్ ఎంప్లాయిస్ డిగ్రీ కళాశాల 1982- 83 వ సంవత్సరంలో స్థాపించారు. కార్మికుల పిల్లలతో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కళాశాలను ఏర్పాటు చేశారు. 1990లో ఎయిడెడ్ వచ్చింది. అప్పట్లో ఈ కళాశాలలో సీటు దొరకని పరిస్థితి ఉండేది.

ప్రస్తుతం 6 విద్యార్థులు

ప్రతిభావంతులైన 29 మంది అధ్యాపకులు ఉండడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 2006 మార్చి 27న అప్పటి ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలలో అధ్యాపకుల ఉద్యోగ భర్తీని నిలిపివేస్తూ జీవో 35ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ కళాశాలలో అధ్యాపకులను నియమించలేదు. ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. గతేడాది ఈ కళాశాలలో 6 గురు విద్యార్థులు చేరాలంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల హామీగానే

ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కళాశాల ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలు కలిసి మొత్తం 72 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎన్నికల హామీగానే ఈ కళాశాల ఉపయోగపడుతోంది తప్ప ఎలాంటి పరిష్కారం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details