ఈ నెల 30కి సమత కేసు తుది తీర్పు వాయిదా సమత కేసు తుది తీర్పు ఈనెల 30కి వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవుపై వెళ్లినట్లు ప్రాషిక్యూషన్ ధర్మారెడ్డి వెల్లడించారు. 30న తుది తీర్పు వెల్లడిస్తారని తెలిపారు.
గతేడాది నవంబర్ 24న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో ఓ వివాహిత హత్యాచారానికి గురైంది. షేక్ బాబు, షేక్ షాబూద్దీన్, షేక్ మగ్దూం అనే ముగ్గురు వ్యక్తులపై ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసు విచారణకు డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. 14న నిందితులపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ జరిగింది. ఈనెల 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు సాగాయి.
10న నిందితుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. 20న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పును వెలువరించాల్సి ఉండగా... ఈనెల 30కి వాయిదా వేసింది.