తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి రెవిన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలంటూ.. నినాదాలు చేశారు. పట్టపగలు మహిళా ఉద్యోగిని అత్యంత క్రూరంగా హత్య చేయడం దారుణమన్నారు. ఇందుకు నిరసనగా మూడు రోజులపాటు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
'మూడు రోజులు విధులు బహిష్కరిస్తున్నాం' - mro vijayareddy news
కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
TAGGED:
mro vijayareddy news