'ఆదివాసీలకు పునరావాసం కల్పించాలి' - KAGAZNAGAR MANDAL
తమ ఆవాసాల నుంచి ఆదివాసీలను బయటకు వెళ్లగొట్టడం అమానుషమని మానవ హక్కుల సంఘం నేతలు మండిపడ్డారు. అడవిలో జీవించే ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని, వారిని కాదనే అర్హత ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
అడవిలో జీవించే ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి : భుజంగరావు
ఆదివాసీలను అడవి నుంచి గెంటేయడం అధికారుల పైశాచికత్వమని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు భుజంగరావు విమర్శించారు. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం వేంపల్లి డిపోలో ఆశ్రయం పొందుతున్న గిరిజనులను మానవ హక్కుల వేదిక నాయకులు, ఆదివాసీ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సోయం చిన్నయ్య పరామర్శించారు. అడవిలో జీవించే ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరితగతిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.