నూతన మున్సిపల్ చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేస్తుంది. మున్సిపాలిటీల్లో అవినీతికి తావులేకుండా సేవలందించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా పౌరులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగకుండా ఆన్లైన్ ద్వారా అనుమతులు, సర్టిఫికెట్లు పొందేలా కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని ఈ-ఆఫీస్ ద్వారా టీఎస్- బీపాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
టీఎస్ బీపాస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్ - latest news of kumurambheem
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్ ద్వారా టీఎస్‌బీపాస్ విధానాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అమల్లోకి తెచ్చారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
టీఎస్‌బీపాస్ సేవలు సద్వినియోగం చేసుకోండి: కమిషనర్
ఈ విధానం ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు.. వారికి గడువులోగా సర్టిఫికెట్లు, అనుమతులు లభిస్తాయని చెప్పారు. టీఎస్ బీపాస్ ద్వారా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ-ఆఫీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్‌ఫోన్ కానుక