కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికి సంబంధించి అధికారులు సప్లమెంటరీ అజెండాను ప్రవేశపెట్టారు. పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య లోపం ఉందని పలువురు కౌన్సిలర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వార్డు నెంబర్ ఏడులో గత నాలుగేళ్ల నుంచి నీటి ఎద్దడి ఉందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చిన పరిష్కరించడం లేదని కౌన్సిలర్ రూప కింద కూర్చొని నిరసన తెలిపారు. ప్రతిసారి హామీలిస్తున్నారు తప్పతే పనులు చేయడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి కమిషనర్ తిరుపతి హామీ ఇవ్వటంతో ఆమె శాంతించారు.
గరంగరంగా కాగజ్నగర్ పురపాలక సర్వసభ్య సమావేశం
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. తమ వార్డులో నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్ రూప కింద కూర్చొని నిరసన తెలిపారు. కమిషనర్ హామీతో శాంతించారు.
కాగజ్నగర్ పురపాలక సర్వసభ్య సమావేశం