కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ మందు కలిపిన నీళ్లను జడ్పీ ఛైర్పర్సన్ కోవలక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్ప్రే చేశారు. ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్పర్సన్ అన్నారు. ప్రజలందరూ సహకరించి ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.
వీధుల్లో స్ప్రే చేసిన ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్పర్సన్ - kumarambhim asifabad
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ మందు కలిపిన నీటిని జడ్పీ ఛైర్పర్సన్ కోవలక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్ప్రే కొట్టారు. ప్రజలు కరోనా భారిన పడకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.
వీధుల్లో స్ప్రే చేసిన ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్పర్సన్
అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిడాం దత్తు, డీపీఓ, గ్రామపంచాయతీ ఈఓ శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మాయదారి మనిషిని నేను అంటున్న ఎస్పీ బాలు