కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో.. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గలోని ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు మంజూరైన 9,10,500 రూపాయల నగదు చెక్కులను అందజేశారు.
సీఎం సహాయ నిధి.. పేదల పెన్నిధి: ఎమ్మెల్యే - teelangana latest news
సీఎం సహాయ నిధి చెక్కులను కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేశారు. ఇందులో ఇరవై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు. మంజూరైన తొమ్మిది లక్షలకుపైగా నగదు చెక్కులను అందజేశారు.
సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ఇరవై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా.. కాగజ్నగర్ టౌన్ 10, కాగజ్నగర్ మండలం 4, సిర్పూర్ టీ 1, చింతలమనేపల్లి 1, బెజ్జూరు 2, పెంచికలపేట 5, దహేగంలో ముగ్గురికి పంపిణీ చేశారు. అత్యవసర సహాయం కింద ఒక్కరికి 1,5,0000 రూపాయలు చెక్కుల ద్వారా అందజేశారు. కార్యక్రమంలో కాగజ్ నగర్ పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, స్థానిక నేతలు పాల్గొన్నారు.