మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నాగబిడ్ తాలూకాలోని దేవసాయిల్ గ్రామానికి సమీపంలో ఆటవీప్రాంతం ఉంటుంది. అటవీ నుంచి గ్రామంలోకి చొరబడిన చిరుత పశువులపై దాడి చేసింది. అప్రమత్తమైన గ్రామస్థులు చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో స్వప్నిల్ ముసార్కార్ అనే వ్యక్తిని చిరుత గాయపరిచింది. చిరుత గ్రామం లోపలికి వెళ్లడం వల్ల స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా... చిరుతను బోనులో బంధించి జిల్లా కేంద్రానికి తరలించారు. చిరుత గ్రామంలోకి ప్రవేశించి ఒకరిని గాయపర్చడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
ఆ గ్రామంలో చిరుత కలకలం.. ఊళ్లో భయం భయం - చిరుత
మహారాష్ట్రలో అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత కలకలం రేపింది. ఇళ్లలోకి దూరి గందరగోళం సృష్టించి ఒకరిని గాయపర్చింది.
మహారాష్ట్రలో చిరుత కలకలం