ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు పోటీ చేసే ఏ అభ్యర్థికీ అనుకూలంగా పని చేయకుండా తటస్థంగా ఉండాలని కుమురం భీం ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో విధులు నిర్వహించే రక్షణ బలగాలతో సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద సమస్య తలెత్తితే మొబైల్ పార్టీకి సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి అంగరక్షకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల టెంట్లను 200 మీటర్ల దూరంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
'ఎన్నికల విధుల్లో తటస్థంగా పని చేయాలి'
ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కుమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఎన్నికల్లో పాల్గొనే రక్షణ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎస్పీ