తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితులకు భోజన వసతి కల్పించాలన్న కలెక్టర్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా రోజురోజుకూ పెరుగుతుండటం వల్ల ర్యాండమ్​గా కరోనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కరోనా బాధితులకు భోజన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

collector sandeep kumar jhaa speaks abou corona victims
కరోనా బాధితులకు భోజన వసతి కల్పించాలన్న కలెక్టర్

By

Published : Aug 4, 2020, 2:41 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వాడలో ర్యాండమ్​గా నమూనాలు సేకరించాలన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో మరో వంద పడకలు ఏర్పాటు చేయాలన్నారు.

కరోనా బాధితులకు భోజన వసతులు కల్పించాలని డీటీడీఓను ఆదేశించారు. కేంద్రం వద్ద ఆరోగ్య, పోలీసు సిబ్బందిని నియమించాలన్నారు. రైల్వే, బస్ స్టేషన్లలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కొవిడ్-19 పెరుగుతున్న తరుణంలో ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు. జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవీ చూడండి:గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details