podu land pattas distribution in telangana :పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం వాటిని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పరిశీలించి.. కసరత్తు పూర్తి చేసి అర్హులైన వారిని ఎంపిక చేసి పట్టాలు సిద్ధం చేసింది.
KCR distributes podu land pattas today :రాష్ట్రవ్యాప్తంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు సిద్ధమయ్యాయి. 1,51,146 మంది పోడు రైతులకు పట్టాలు అందనున్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది రైతులకు 1,51,195 ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 24,181 మంది రైతులకు 67,730 ఎకరాలకు పట్టాలు ఇవ్వనున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15,519 మంది రైతులకు 47,138 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.
CM KCR Asifabad Tour :ఆదిలాబాద్లో 31,683 ఎకరాలకు గాను 12,222 పోడు రైతులకు.. నిర్మల్ జిల్లాలో 20,051 ఎకరాలకు 7,275 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేస్తారు. ములుగు జిల్లాలో 18,460 ఎకరాలకు గాను 7,129 మంది రైతులకు.. ఖమ్మం జిల్లాలో 12,470 ఎకరాలకు గాను 6,598 పోడు రైతులకు పోడు పట్టాలు అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో 11,347 ఎకరాలకు గాను 5,015 మంది రైతులకు.. నిజామాబాద్ జిల్లాలో 8,611 ఎకరాలకు గాను 4,229 మంది రైతులకు పట్టాలు అందించనున్నారు.
వరంగల్లో 7,333 ఎకరాలకు గాను 4271 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8,088 ఎకరాలకు గాను 3250 పోడు రైతులకు పట్టాలు ఇస్తారు. నల్గొండ జిల్లాలో 5,578 ఎకరాలకు గాను 2,928 మందికి, మంచిర్యాల జిల్లాలో 5,024 ఎకరాలకు గాను 2,403 రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 5,056 ఎకరాలకు గాను 1,973 మందికి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,859 ఎకరాలకు సంబంధించి 1,614 రైతులకు పట్టాలు ఇస్తారు.
సంగారెడ్డి జిల్లాలో 1,808 ఎకరాలకు గాను 1,127 రైతులకు.. మెదక్ జిల్లాలో 525 ఎకరాలకు గాను 610 పోడు రైతులకు పట్టాల పంపిణీ ఉంటుంది. వికారాబాద్ జిల్లాలో 436 మంది రైతులకు చెందిన 553 ఎకరాలకు.. వనపర్తి జిల్లాలో 389 మంది రైతులకు చెందిన 455 ఎకరాలకు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 205 మంది రైతులకు 213 ఎకరాలకు పోడు పట్టాలు అందిస్తారు.