కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలను తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరాస్తాలో కేసీఆర్ చిత్రపటానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి సందడి చేశారు. అభిమానులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే మిఠాయిలు తినిపించారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 45 లక్షల ఎకరాలకు నిరందించడం ఒక కేసీఆర్కె చెల్లిందని కోనప్ప కొనియాడారు.
కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం - trs
కాగజ్‌నగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబురాలు కన్నులపండువగా జరిగాయి. కేసీఆర్ చిత్రపటానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాలాభిషేకం చేశారు.
అభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే