తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుర్బానీ ఇచ్చే సమయంలో నిబంధనలు అతిక్రమించవద్దు' - కాగజ్​నగర్​లోని ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం

బక్రీద్​ పండుగ నేపథ్యంలో కుమురంభీం జిల్ల కాగజ్​ నగర్​ అధికారులు ముస్లిం మతపెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాపిస్తోన్న సమయంలో నిబంధనలు పాటిస్తూ సామరస్యపూర్వకంగా పండుగను జరుపుకోవాలని సూచించారు.

Kagaznagar authorities of Kumarakam bheem district have arranged a peace meeting with Muslim elders
'కుర్బానీ ఇచ్చే సమయంలో నిబంధనలు అతిక్రమించవద్దు'

By

Published : Jul 29, 2020, 3:15 PM IST

బక్రీద్ పండుగ నేపథ్యంలో కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలక కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో అధికారులు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బీఎల్ఎన్ స్వామి, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఎస్ఎచ్ఓ మోహన్, కమిషనర్ శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

పండుగను భక్తి శ్రద్ధలతో సామరస్య పూర్వకంగా జరుపుకోవాలని డీఎస్పీ స్వామి సూచించారు. కుర్బానీ ఇచ్చే సమయంలో పశు వైద్యుల అనుమతి తీసుకున్న తర్వాతనే వాటిని వధించాలని, నిబంధనలు అతిక్రమించవద్దని కోరారు.

కరోనా నేపథ్యంలో విధిగా మాస్కులు ధరించాలని, కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలో ప్రతి పండుగను సామరస్య పూర్వకంగా జరుపుకుంటున్నామని.. ఈసారి కూడా అలానే జరుపుకుంటామని మతపెద్దలు తెలిపారు. జంతు వధశాలల వద్ద కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరగా అధికారులు ఏర్పాట్లు చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details