కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు దృష్టి సారించారు. మండలంలోని పెద్దవాగు, రాస్పల్లి వాగు తదితర ప్రాంతాల నుంచి వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఇసుక తరలించడానికి పలువురికి అనుమతి ఉంది. అయితే అభివృద్ధి పనుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారంటూ ఆరోపణలు రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. 12 ట్రాక్టర్లను పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్ వనజా రెడ్డి తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు స్వాధీనం - tractors
అక్రమ ఇసుక రవాణాపై అధికారులు దృష్టి సారించారు. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు స్వాధీనం