కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారు.
పట్టణంలో వాహన తనిఖీలు చేస్తుండగా.. మూడు లారీల్లో పశువులు కనిపించినట్లు కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మహారాష్ట్రలోని బండరా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మూడు లారీల్లో 104 పశువులున్నాయని.. అందులో నాలుగు మృతి చెందినట్లు తెలిపారు.