తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని.. హెడ్​కానిస్టేబుల్​ ఆందోళన!

విధుల్లోంచి తనను అన్యాయంగా తొలగించారంటూ కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి హెడ్​ కానిస్టేబుల్​ మెంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని.. ఎలాంటి విచారణ జరపకుండానే వదిలివేసిన ఘటనలో హెడ్​ కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Head Constable Protest For his job in kumuram bheem district
అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని.. హెడ్​కానిస్టేబుల్​ ఆందోళన!

By

Published : Aug 7, 2020, 3:22 PM IST

కుమురం భీం జిల్లా చింతల మానేపల్లి హెడ్​ కానిస్టేబుల్​ మెంగారావును విధుల్లోంచి తొలగిస్తున్నట్టు వచ్చిన ఉత్తర్వుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారంటూ మెంగారావు ఆరోపించారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో పది రోజుల క్రితం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి విచారణ జరుపకుండానే వాహనాన్ని వదిలిపెట్టారు. ఈ విషయం బయటకు పొక్కడం వల్ల విచారణ చేపట్టిన అధికారులు హెడ్​ కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు హెడ్​ కానిస్టేబుల్​ మెంగారావును ప్రశ్నించగా.. పైఅధికారుల ఆదేశాల మేరకే.. వాహనాన్ని వదిలిపెట్టినట్టు.. తనకు ఏం తెలియదని, గిరిజన, ఆదివాసీ తెగకు చెందిన వాడిని కాబట్టే తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మెంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details