కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు జరిపారు. తెల్లవారు జామున కాకడ హారతి, ఏడు గంటలకు అభిషేకం, పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పుస్తక పూజ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహా ప్రసాద వితరణ జరుగుతుంది. రెండు గంటలకు మధ్యాహ్న హారతికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. కార్యక్రమానికి పట్టణంలోని ప్రజలు భారీగా హాజరై సాయికృపకు పాత్రులయ్యారు.
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు - guru-poornima celebrations
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబా గుడి రద్దీగా మారింది. గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు