యూరియా కష్టాలు.. గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు - యూరియా కష్టాలు.. గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో యూరియా కష్టాలు రైతులను వెంటాడుతునే ఉన్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండాక్యూలైన్లలోనే గంటల తరబడి గడుపుతున్నారు.
యూరియా కష్టాలు.. గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. కావాల్సిన స్థాయిలో ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అరకొరగా పంపిణీ చేసే యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వస్తోందని వాపోయారు. కాగజ్‌నగర్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం బారులు తీరారు.
TAGGED:
urea problems