తెలంగాణ

telangana

ETV Bharat / state

'అత్యాచార నిందితుడిని శిక్షించాలి' - students

చిర్రకుంట అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుమరం భీం ఆసిఫాబాద్​లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. నిందితుడు జ్ఞానేశ్వర్​ను ఉరితీయాలని డిమాండ్  చేశారు.

నినాదాలు చేస్తున్న విద్యార్థులు

By

Published : Jul 2, 2019, 10:12 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలో ఆదివారం ఓ చిన్నారిని జ్ఞానేశ్వర్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడిని ఇంత వరకు పట్టుకోలేదు. ఆగ్రహం చెందిన విద్యార్థులు జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. అంబేడ్కర్​ చౌరస్తా వరకు ర్యాలీ తీసి మానవహారం నిర్వహించారు. అత్యాచారం జరిగి 40 గంటలు గడుస్తున్నా నిందితున్ని అరెస్ట్ చేయకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details