కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని వార్డుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారు చికిత్స తీసుకోవాలని తెలిపారు. కొవిడ్ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, కమిషనర్ కె.శ్రీనివాస్ నివారణ చర్యలను సమీక్షించారు.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన అధికారులు - కుమురంభీం ఆసిఫాబాద్ లేటెస్ట్ అప్డేట్స్
కాగజ్‌నగర్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసులు ఎక్కువగా ఉన్న వార్డుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. కొవిడ్ ప్రత్యేక అధికారి ఈ నివారణ చర్యలను సమీక్షించారు.
కాగజ్‌నగర్‌లో కరోనా నివారణ చర్యలు, కొవిడ్ నివారణ చర్యలు
కరోనా సోకిన వారు బయటకు రాకూడదని ఆదేశించారు. లాక్డౌన్ అమలుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.