కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలంలో రెండు గ్రామాల ప్రజల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉచ్చమల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టుకోవడానికి చెడ్వాయి గ్రామానికి చెందిన సొసైటీ సభ్యులు, మత్స్య కారులు వెళ్లారు. చేపలు పడుతుండగా... దరోగాపల్లి సొసైటీ అధ్యక్షుడు భీమన్నతో పాటు కొందరు గ్రామస్థులు అక్కడికి వచ్చారు. మీరు ఎలా చేపలు పడతున్నారని వారిని ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు జరిగి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి.. రెండు గ్రామాల ప్రజలపై కేసు నమోదు చేశారు.
చేపల కోసం ఇరు గ్రామాల మధ్య ఘర్షణ - fishers
కొమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలంలో రెండు గ్రామాల ప్రజల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చేపల విషయంలో దరోగపల్లి, చెడ్వాయి గ్రామస్తులు మధ్య ఘర్షణ తలెత్తింది.
చేపలు తెచ్చిన తిప్పలు