కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసీ మహిళలు బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు. మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ, బడ్జెట్ కేటాయించి ఆదివాసీ మహిళలను ఆదుకొని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సుగుణ పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించి ఎస్టీలకు రావలసిన ఉద్యోగాలు వీరికే వచ్చేలా చేయాలని కోరారు.
ఆదివాసీ మహిళల భారీ బహిరంగ సభ - AADIVASI WOMENS SPECIL PROGRAM FOR WOMENS DAY CELEBRATIONS
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ఆదివాసీ మహిళలు బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.
ఆదివాసీ మహిళల భారీ బహిరంగ సభ
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించుకుంటే మునుముందు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుపుతామని హెచ్చరించారు. రాణి దుర్గావతిని ఆదర్శంగా తీసుకొని ఆదివాసీ మహిళలు ముందుకు సాగాలని అన్నారు. ఎంపీ సోయం బాపురావు ఉట్నూర్ నుంచి జైనూర్ వరకు ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాణి దుర్గావతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
TAGGED:
MP SOYAM BAPURAO LATEST NEWS