ఖమ్మం జిల్లాలోని వైరా జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ప్రాజెక్టు నీటిమట్టం 13.3 అడుగులకు చేరింది. కారేపల్లి, జూలూరుపాడు, ఏనుకూరు మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటితో జలాశయం నిండు కుండలా మారింది. మొన్నటి వరకు నీటి నిల్వ తక్కువగా ఉండటం వల్ల నిరాశ చెందిన రైతులు.. ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతోన్న వైరా జలాశయ నీటిమట్టం - వైరా
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వైరా జలాశయంలో నీటిమట్టం పెరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 13.3 అడుగులకు చేరింది.
వైరా జలాశయ నీటిమట్టం