ఖమ్మంజిల్లా పల్లిపాడులోని శ్రీ విజయ శీతల మహచక్ర జీవనాభిశిలా ముక్తకేశ్వరీ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరింగింది.
వైభవంగా దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్ఠ
By
Published : Mar 28, 2019, 10:44 AM IST
వైభవంగా దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్ఠ
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో శ్రీ విజయ శీతల మహాచక్ర దివ్య జీవనాభిశిల, ముక్తకేశీశ్వరీ దేవతా మూర్తుల ప్రతిష్ఠ కన్నుల పండువగా జరిగింది. నాలుగో రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాల నుంచి యంత్రాలను తీసుకొచ్చి ప్రతిష్ఠగావించారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. నేడు ఆలయం వద్ద అన్నదానం నిర్వహించనున్నారు.