ఇవాళ అసెంబ్లీ ఆవరణలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మీడియాతో చిట్‌చాట్ చేశారు. మీడియా సందించిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. "మీరు ఏపార్టీలో ఉన్నారు.." అని మీడియా ప్రతినిధులు అడగిన ప్రశ్నకు తాను ప్రస్తుతం గాలిలో ఉన్నానని సమాధానం చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ జాబితాలో ఎలా ఉంటే... నేను ఆ పార్టీలో ఉన్నట్లని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ వ్యవహారాలన్నీ మెచ్చా నాగేశ్వరరావుకే అప్పగించిందని తెలిపారు. కొద్దిరోజులుగా సండ్ర గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
"నాది ఏ పార్టీనో.. నేను ప్రస్తుతం గాలిలో ఉన్నా..." - MLA
ఈరోజు శాసనసభ ఆవరణలో తెతెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాదీ ఏ పార్టీనో... నేను ప్రస్తుతం గాలిలో ఉన్న" అంటూ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో చెప్పారు.
assembly
ఇవీ చూడండి:"ఇప్పుడు నా అక్కర మీకు లేదయ్యా.."